తన మాట అమ్మ జోల పాటలా
తన నవ్వు విరిసిన మల్లె తోటలా
తన నడక నెమలి ఆటలా
ఆకాశం నుంచి నక్షత్రం జారి తన నుదుటి బొట్టైనట్టు
చందమామ పంతం పూని తన బుగ్గల్లొ తెలుపైనట్టూ
అమాయకత్వం అచ్చుపోసుకున్నట్టు,చిలిపతనం అడుగులేస్తునట్టు
మంచితనం మాట నేర్చుకున్నట్టు,పసితనం పరుగుతీస్తున్నట్టు
దేవుడే కలగని సృష్టించాడేమో అనిపించాలి
దేవతలంతా ఈర్ష్యపడి కిందకి పంపేసారేమొ అని అంతా అనుమానించాలి

